KMR: పిట్లంలో మంగళవారం కురిసిన వర్షం అన్నదాతను అగమ్య గోచరంలో పడేసింది. రహదారుల పక్కన ఆరబెట్టిన ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. రైతులు ప్లాస్టిక్ కవర్లు తెచ్చి కప్పేలోపే ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం రంగు మారే అవకాశం ఉందన్నారు.