అనకాపల్లి మండలం వెంకుపాలెంలో వరి పంట నీట మునిగింది. భారీ వర్షాలతో పాటు వెదుళ్లగెడ్డకు గండిపడిన కారణంగా వరదనీరు ఉదృతంగా ప్రవహించడంతో సుమారు 250 ఎకరాల్లో వరి పంట ముంపుకు గురైంది. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధ నాగ జగదీష్ ముంపుకు గురైన పొలాలను పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు.