GNTR: గుంటూరు జిల్లాలో మొంథా తుపాను ప్రభావం మొదలైంది. తెనాలి, గుంటూరు, మంగళగిరి, కొల్లిపర మండలాల్లో బలమైన గాలివాన ముప్పు మధ్యాహ్నం తర్వాత భారీగా ఏర్పడింది. తీవ్రమైన గాలుల కారణంగా చెట్లు ఊగిపోతున్నాయి. పలుచోట్ల గాలితో కూడిన వర్షం పడుతోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తూ, ప్రజలు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.