MDK: పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎంపీడీవో షాకీర్ అలీ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కోలపల్లి గ్రామంలో 20 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 16 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గీత, లబ్ధిదారులు పాల్గొన్నారు.