ప్రకాశం: మార్కాపురం మండలం పెద్దనాగులవరంలో నివాసంలేని చెంచు కుటుంబాలను మండల ప్రత్యేక అధికారి సత్యనారాయణ గుర్తించారు. మంగళవారం తుఫాన్ ప్రభావంతో ముందస్తు చర్యల్లో భాగంగా చెంచు ప్రజలు ఇబ్బంది పడకుండా 30 మంది చెంచువాసులకు పునరావస కేంద్రం ఏర్పాటు చేసి వారికి భోజనాలు మౌలిక వసతులు కల్పించారు. అంతేకాకుండా మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేశారు.