W.G: ఆకివీడు శివారు ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద వరద నీటి ప్రవాహాన్ని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యే కనుమూరు రఘురామరాజులు పరిశీలించారు. మందపాడు, గుమ్ములూరు ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులంతా అప్రమత్తంతో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నీటి సంఘాల అధ్యక్షులకు పలు సూచనలు చేశారు.