ప్రకాశం: పామూరు పట్టణంలోని NH 167B నేషనల్ హైవే మనోహర్ జంక్షన్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలతో వస్తున్న ఆటోను ట్రిప్పర్ ఢీ కొట్టింది. దీంతో ఆటోలో పాల క్యాన్లలో ఉన్న పాలు మొత్తం రోడ్డుపాలయ్యాయి. అయితే ఆటోలో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.