కోనసీమ: అమలాపురం నియోజకవర్గం చిందాడగరువు గ్రామ సర్పంచ్ పొనకల గణేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం జనరల్ సెక్రెటరీగా ఇటీవల నియమితులైన మాదిరెడ్డి లోవరాజును సోమవారం శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి బండి ధర్మ, శీలం సాయిరాం జంగా నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.