KRNL: ఆదోని పట్టణంలోని శ్రీనివాస భవన్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఇవాళ తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారమే టిఫిన్, భోజన పదార్థాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. సందర్శకులకు ఫిల్టర్ వాటర్ అందుబాటులో ఉంచాలని, తిన్న ప్లేట్లను వేడి నీళ్లతోనే శుభ్రం చేసి పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.