E.G: నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎ. పీ. విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) రెడ్ అలర్ట్ జారీ చేసిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.