NZB: బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక మున్సిపాలిటీలో స్వీపర్ గా విధులు నిర్వర్తిస్తున్న భాగ్యం నాగమణి(40)ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కాలు ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. అక్కడే ఉన్న సహచరులు, స్థానికులు వెంటనే స్పందించి ఆమెను బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.