ప్రతి ఇంట్లో LPG వంటగ్యాస్ సిలిండర్ ఉంటోంది. ప్రమాదం జరిగితే వినియోగదారుల కుటుంబానికి రూ.30 లక్షల బీమా వర్తిస్తుంది. రూపాయి కూడా చెల్లించక్కర్లేదు. గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ఈ బీమా వర్తింపజేస్తారు. ఆస్తినష్టం రూ.2 లక్షలు, ప్రాణాలు కోల్పోతే రూ.6 లక్షలు, ప్రమాదం బారినపడి చికిత్స పొందుతున్న ఒక్కో సభ్యుడికి రూ.2 లక్షలు అందిస్తారు.