KDP: వేంపల్లి ప్రాంతంలో ప్రమాదకరంగా బైకు విన్యాసాలు చేసిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. యువకులు 3 ద్విచక్ర వాహనాలపై ప్రమాదకర విన్యాసాలు చేయగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, పలు పత్రికల్లో వార్తలు రావడంతో SI తిరుపాల్ నాయక్ తమ సిబ్బందితో కలిసి ఐదుగురి యువకులను అరెస్టు చేసి మూడు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.