కృష్ణా: తుఫాన్ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారిణి జే.అరుణ సూచించారు. మట్టి మిద్దెలు, కల్వర్టులు, పూరి గుడిసెలు, రోడ్డు పక్కన గుడారాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వీఆర్వోలు, కార్యదర్శులు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.