మహిళల ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించబడిన ఈ మ్యాచ్లో, బంగ్లా 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. షర్మిన్(36), శోభన(26) మాత్రమే పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రాధా 3, శ్రీ చరణి 2 వికెట్లు తీయగా, దీప్తి, రేణుకా, అమన్జోత్ తలో వికెట్ పడగొట్టారు.