KMR: పేకాట ఆడితే ఊరుకునేది లేదని పెద్ద కొడఫ్గల్ ఎస్సై అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం వేకువ జామున మండలంలోని అంజని గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 12,750 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.