NLR: జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా ఆదేశాలతో మనుబోలు మండలం- పల్లిపాలెం గ్రామంలో గిరిజనుల ఇళ్ల నిర్మాణం కోసం ఆదివారం హౌసింగ్ అధికారులు సర్వే నిర్వహించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు తమకు ఇల్లు లేవని గిరిజనులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సర్వేచేసి అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మిస్తామని హౌసింగ్ ఏఈ శరత్‌బాబు తెలిపారు.