కోనసీమ: కాట్రేనికోన మండలంలోని తీర ప్రాంత మత్స్యకార ప్రజలను తుఫాన్ షెల్టర్లకు చేర్చాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని బలుసు తిప్ప తుపాన్ షెల్టర్‌ను ఆయన పరిశీలించారు. మగసాని తిప్ప గ్రామ ప్రజలతోపాటు తాటాకు ఇళ్లలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.