ASF: తిర్యాణి మండలం కన్నెపల్లిలో ఆదివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పెరక సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తేదారులు నాణ్యతతో, సరైన సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పెరక సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యం రాజన్న, రాష్ట్ర నాయకులు చుంచు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.