సత్యసాయి: ప్రజలు, మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా పోలీసులు ‘వారధి’ పేరిట వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు రామాపురంలో డీఎస్పీ హేమంత్ కుమార్ ఎల్ఈడీ డిస్ప్లే ద్వారా నేరాలు, సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలు, పోక్సో చట్టాలపై గ్రామస్థులకు వివరించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100/112కు సమాచారం ఇవ్వాలని కోరారు.