ASR: చింతపల్లి మండలం లోతుగెడ్డ బ్రిడ్జి వద్ద 137 కిలోల గంజాయి పట్టుబడిందని సీఐ వినోద్ బాబు తెలిపారు. ముందస్తు సమాచారంతో అన్నవరం ఎస్సై వీరబాబు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా కారు, రైండు బైక్‌లపై తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు.