ADB: కంది శ్రీనివాస రెడ్డి బావమరిది గడ్డం అఖిల్ రెడ్డి ఇటీవల గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి బాధిత కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.