MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలోని వన దుర్గమ్మ ఆలయంలో బుధవారం సాయంత్రం ప్రదోషకాలంలో అమ్మవారికి కార్తీక మాసం షష్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించి మంగళ హారతులు చేశారు అనంతరం ప్రధాన అర్చకులు శంకర్ శర్మ ఆకాశ దీపాన్ని ఆవిష్కరించి దర్శించుకున్నారు.