WGL: జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాను ప్రభావంతో బుధవారం కుండపోత వర్షం కురుస్తుండడంతో ఖిలా వరంగల్, అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఇళ్లను MRO ఇక్బాల్, ఎస్సై కీర్తన్, జూనియర్ అసిస్టెంట్లు వంశీ, శివ, జీపీఓ సుభాష్ సందర్శించారు. ప్రజల బాగోగులు తెలుసుకొని సూచనలు ఇచ్చారు. అత్యవసరం తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.