VZM: తుఫాన్ వలన సంభవించిన నష్టాలను వెంటనే పంపాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. శాఖల వారీగా జరిగిన నష్టాలను తెలియజేస్తూ వాటి పునరుద్ధరణకు అయ్యే ఖర్చు అంచనాలను కూడా బుధవారం సాయంత్రంలోగా పంపాలని తెలిపారు. నష్టాల అంచనాలు ఖచ్చితంగా ఉండాలని, ప్రత్యక్షంగా చూసి రాయాలని, ఫోటోలను సైతం పంపాలని సూచించారు.