HYD: బీఎస్పీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నవంబర్ 1న ఛలో ఇందిరా పార్క్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే మొంథా తుఫాన్ కారణంగా ధర్నా కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ తెలిపారు. తదుపరి ధర్నా తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.