SKLM: అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలో పోలీస్ స్టేషన్ లలో ఆదివారం పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో జిల్లా పోలీసు శాఖకు చెందిన అధికారులు,సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాల స్ఫూర్తిని స్మరించుకోవడం, దేశభక్తి భావాన్ని పెంపొందించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశ్యం అని సంబధిత అధికారులు తెలిపారు.