హన్మకొండ: పట్టణ కేంద్రంలోని జూలైవాడకు చెందిన బాలుడు MD అహ్మద్ తప్పిపోయి సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో తిరుగుతుండగా పోలీసులు గుర్తించారు.సమాచారం తెలుసుకున్న సీఐ సువర్ణ బాలుడిని సురక్షితంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించి అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.