కృష్ణా: నాగ పంచమి సందర్భంగా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఆదివారం ఒక్కరోజులో వివిధ సేవల టిక్కెట్ల రుసుము ద్వారా రూ. 7,28,410 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో చెప్పారు.