VZM: వేగావతి నది పరివాహక ప్రాంతమైన పెంట, కొత్తపెంట, పారాది, అలజంగి, జె.రంగరాయపురం, కారాడ, భోజరాజపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బొబ్బిలి MRO ఎం. శ్రీను ఆదివారం హెచ్చరించారు. పెద్దగెడ్డ సాగునీటి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నది ఉద్ధృతంగా ప్రవహిస్తుందని, ఎవరు నదిలో దిగవద్దని, పశువులను దింపవద్దని సూచించారు.