HNK: కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలో ఆదివారం రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డికి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులు వినతి పత్రం సమర్పించారు. మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్ ఆధ్వర్యంలో రైతులు జంగాను కలిసి భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల్లో పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.