HYD: తెలంగాణ భవన్లో తెలంగాణ హోటల్స్ కార్మిక యూనియన్ నేతలతో మాజీ మంత్రి KTR సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు హోటళ్ల కార్మిక నాయకులు BRSలోకి చేరగా, వారికి KTR పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత BRS హయాంలో హోటల్ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలన్నారు.