కార్తీక మాసంలో సోమవారానికి విశిష్టత ఉంది. శివ కేశవులకు ప్రీతిపాత్రమైన సోమవారం రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం అని పండితులు చెబుతున్నారు. ఈ నెల రోజులు పూజ చేసినా.. సోమవారం ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో శివయ్యను పూజిస్తారు. ఇవాళ తొలి సోమవారం కావడంతో ఉపవాసం ఉండి.. దీపారాధాన చేసి, దానం చేసిన వారికి కోటియాగాలు చేస్తే వచ్చే పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం.