SKLM: నరసన్నపేట మండలం కోమర్తి రహదారిపై అదే గ్రామానికి చెందిన బి.అప్పలనాయుడు (40) ఆదివారం మూర్ఛ వ్యాధితో పడి పోయారు. తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు వెంటనే శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన తల్లి త్రినాథమ్మతో కలిసి ఉంటున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు శిక్షణ ఎస్సై ప్రమీలా దేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.