HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి సీతక్క సోమవారం ఉదయం ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కృష్ణకాంత్ పార్కులో మార్నింగ్ వాకర్స్‌తో ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటు వేసి గెలిపించాలన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు.