కోనసీమ: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీమ్ భాషా ఆదివారం తెలిపారు. సోమవారంతో పాటు మంగళవారం, బుధవారం కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించిన సంగతి విధితమే అన్నారు. అన్ని పాఠశాలలు దీన్ని గమనించాలని ఆయన సూచించారు.