KRNL: ఆదోని పట్టణంలోని స్థానిక శుక్రవారపేటలో ఇవాళ వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాటామాటా పెరిగి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో దుర్గయ్య, బ్రహ్మయ్య, శ్రీరాములు, చంద్ర, ముని సహా ఆరుగురు గాయపడ్డట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘర్షణకు గల కారణాలపై వన్‌టౌన్ సీఐ శ్రీరాములు విచారణ కొనసాగుతున్నారు.