AP: మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుఫాన్ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాగా తుఫాన్ ఉండడం వల్ల అధికారులకు ప్రభుత్వం సెలవులను రద్దు చేసిన విషయం తెలిసిందే.