JN: నేడు (గురువారం) తెల్లవారుజామున నుండి ఒక్క సారిగా ఎండ రావడంతో జనగామ జిల్లా రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి తీవ్రంగా నష్టపోయాము అని వరి, పత్తి, మొక్క జొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈరోజు ఎండ రావడం సంతోషం అని, తడిసిన ధాన్యం ఆరే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలంటున్నారు.