VSP: మధురవాడ కార్తీక మొదటి సోమవారం కావడంతో ఐటీ రోడ్డులోని మిథిలాపురి వుడా లే అవుట్ శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయ ప్రాంగణానికి తెల్లవారుజాము నుంచే భక్తుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అయ్యప్ప స్వాములు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు తీర్థ తీర్థ ప్రసాదాలు అందజేశారు.