KMM: పెనుబల్లి మండలంలో జాతీయ రహదారిపై ఓ కారు డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం… కొత్తగూడెం వైపు నుంచి వస్తున్న ఒడిశాకు చెందిన కారు డివైడర్ను ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చెన్నైకి చెందిన హనీష్ (27) మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.