KMR: మద్నూర్ మండలం ఖరీఫ్ పంటలైన పెసర, మినుము పంటలు రంగు మారడంతో ధర తక్కువతో నష్టపోతున్నారు. భారీ వర్షాలు కురువడంతో పంటలు నీటిలో ఉండటంతో పంట రంగు మారింది. పండిన పంటను అడత్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో పెసర ధర క్వింటాకు రూ.7000, మినుము రూ. 7,500 ధర ఉండగా రంగు మారిన కారణంగా రూ.5,500 నుంచి రూ.6,000 వరకు అమ్మకం చేసినట్లు రైతులు వాపోతున్నారు.