కోనసీమ: మొంథా తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. సోమవారం ద్రాక్షారామంలో ఆయన మాట్లాడారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని మంత్రి కోరారు.