KKD: కోస్తా జిల్లాలపైకి మొంథా తుఫాను దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కాసేపట్లో తుఫానుగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇది రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. మంగళవారం దాదాపు 12 గంటలపాటు దాని తీవ్రత కొనసాగి, తర్వాత తుఫానుగా బలహీనపడొచ్చని తెలిపారు.