ప్రొ కబడ్డీ సీజన్-12లో భాగంగా ఇవాళ 2 కీలక మ్యాచులు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఎలిమినేటర్-2 మ్యాచ్‌లో పాట్నా పైరెట్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడుతుంది. ఆ తర్వాత, రాత్రి 9 గంటలకు క్వాలిఫయర్-1 మ్యాచులో పుణేరీ పల్టాన్స్ని దబాంగ్ ఢిల్లీ ఢీకొననుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఈ నెల 31న జరిగే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది.