GNTR: గుంటూరు జిల్లా మంగళగిరిలో తొలిసారిగా యాదవ సామాజిక వర్గీయులు సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎదురుగా జరిగిన ఈ వేడుకల్లో 6 దున్నపోతులు పాల్గొన్నాయి. ముఖ్యంగా ‘భైరవ’ అనే దున్నపోతు చేసిన విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు.