AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భారీగా భక్తుల రద్దీ ఉంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న స్వామివారిని 80,021 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో హుండీ ఆదాయం రూ.3.90 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.