MBNR:చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్లోని శ్రీ కురుమూర్తిస్వామి అలంకరణ మహోత్సవం ఆదివారంరాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వామివారి తొలిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దంపతులు పాల్గొని అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థానాధీశులు రాజా రాంభూపాల్, ఆలయ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.