VZM: భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ సోమవారం పర్యటించారు. తుఫాను పరిస్థితులను సమీక్షించారు. మత్స్యకారులు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.