W.G: తుఫాను వల్ల రానున్న 4 రోజులపాటు భారీ వర్షాలు, బలమైన గాలులు ఏర్పడే అవకాశం ఉన్నందున అధికారులు, నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. ప్రభుత్వ హెచ్చరికల దృష్ట్యా అందరూ జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దన్నారు. అత్యవసర పరిస్థితులుంటే ఎమ్మెల్యే కార్యాలయం నంబర్లను సంప్రదించాలన్నారు.